
జిల్లా బేస్‌బాల్ మహిళల ప్రాబబుల్స్ జట్టు ఎంపిక
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల క్రీడామైదానంలో సోమవారం జిల్లాస్థాయి బేస్‌బాల్ మహిళల ప్రాబబుల్స్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నళిని క్రీడాకారిణులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారిణులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా బేస్‌బాల్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎంపికై న క్రీడాకారిణులకు మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా తుది జట్టును ఎంపిక చేసి ఈ నెల 16 నుంచి 18 వరకు ఆదిలాబాద్ జిల్లాలోని ఐపీ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, సాఫ్ట్‌బాల్ కోచ్ మౌనిక, పీఈటీ జ్యోత్స్న, నర్మద, సీనియర్ క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు.