ఆటంతా అజ్జదే.. | - | Sakshi
Sakshi News home page

ఆటంతా అజ్జదే..

Aug 12 2025 11:06 AM | Updated on Aug 13 2025 7:18 AM

ఆటంతా అజ్జదే..

ఆటంతా అజ్జదే..

సీఎంసీ వ్యవహారంపై సర్వత్రా చర్చ

ప్రారంభానికి ముందే కేసులు, కోర్టులు

ఐఎంఏ పేరును విచ్చలవిడిగా

వాడుకున్నారనే ఆరోపణలు

మెడికల్‌ కళాశాలలో

ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు!

ఏప్రిల్‌లోనే పోలీసులకు

ఫిర్యాదు చేసిన షణ్ముగం మహాలింగం

మలుపు తిరిగింది ఇక్కడే..

చైర్మన్‌గా ఉన్న మహాలింగం అనారోగ్య కారణాలతో కొంతకాలంపాటు సీఎంసీ వైపు రాలే దు. ఇక్కడే అజ్జ శ్రీనివాస్‌ కథ మలుపు తిప్పా రు. త్వరలోనే సీఎంసీ ప్రారంభమవుతుందని, తాను డైరెక్టర్‌గా ఉన్నానని ప్రచారం చేసుకున్నారు. కమిటీకి తాను ఇచ్చిన చెక్కులను చూపి వైద్యులను, ఇతర స్టాఫ్‌ను నియమించేశాడు. ఈ క్రమంలో పలువురు వైద్యుల నుంచి రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డ బ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

నిజామాబాద్‌నాగారం: క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశా ల, ఆస్పత్రి ప్రారంభానికి ముందే వివాదాలకు కేంద్రమైంది. గ్రామీణులకు వైద్య సేవలందించడంతోపాటు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురా వాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన వారి వద్దకు ఐఎంఏ ముసుగులో చొచ్చుకువెళ్లిన ప్రముఖవైద్యు డు అజ్జ శ్రీనివాస్‌ వారిని బెదిరించి అసత్య ప్రచా రం చేశారని తెలిసింది. అజ్జ శ్రీనివాస్‌ ఇచ్చిన చెక్కు లు బౌన్స్‌ అయ్యాయని, వైద్య పరికరాల సప్లై వ్యవహారంలో చీటింగ్‌ చేశారని చైర్మన్‌ షణ్ముగం మహా లింగం ఏప్రిల్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతా తానే అవ్వాలనే అత్యాశతో..

కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన వారు ఒక బృందంగా ఏర్పడి మెడికల్‌ కళాశాలలు, ఆస్పత్రులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా డిచ్‌పల్లిలోని సీఎంసీని లీజుకు తీసుకుని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆ కమిటీకి షణ్ముగం మ హాలింగం చైర్మన్‌గా ఉంటూ ఆస్పత్రి ప్రారంభం, మెడికల్‌ కళాశాల అనుమతులకు సంబంధించి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్‌తో పరిచయం ఏర్ప డింది. వైద్యుడిగా తాను పని చేస్తానని కమిటీతో శ్రీనివాస్‌ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మహాలింగం, శ్రీనివాస్‌ మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డా యి. దీన్ని అవకాశంగా మల్చుకున్న శ్రీనివాస్‌.. వ ురో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రి ప్రారంభానికి అవసరమయ్యే వైద్య పరికరాల సప్లై బాధ్యతల్లో సైతం తలదూర్చారు. తనకు డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వాలని, తన వంతుగా రూ.5 కోట్లు పెట్టుబడిగా పెడతానని ఒప్పందం చేసుకుని కమిటీకి చెక్కు(ఐఎంఆర్సీ పేరుతో)లు సైతం ఇచ్చాడు.

వేతనాలు ఇవ్వకపోవడంతో వివాదం

అజ్జ శ్రీనివాస్‌ చెప్పిన మాటలను నమ్మి సీఎంసీలో ఉద్యోగులుగా చేరిన వైద్యులు, స్టాఫ్‌ తమకు జీతా లు ఇవ్వడం లేదని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి వివాదం మొదలు కావడం, వైద్య పరికరాల సప్లై వ్యవహారం పంచాయితీ కావడం, తాను కమిటీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో శ్రీనివాస్‌ అప్రమత్తమయ్యాడు. సీఎంసీ పేరుతో షణ్ముగం మహాలింగం డబ్బులు వసూలు చేసి పరారయ్యాడని గత నెల 5న డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ రోజు నుంచి సీఎంసీ మోసమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టిన ఆయ న 8వ తేదీన మరోసారి, 13న ఇంకోసారి మహాలింగంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలుకు బడి ఉపయోగించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాడు. వివాదం ముదరడంతో అంతా సైలెంట్‌ అయ్యారు.

ఏప్రిల్‌ నుంచే అజ్జపై ఫిర్యాదులు

అయితే తమను మోసం చేయడంతోపాటు వేధిస్తున్నాడని సీఎంసీ కమిటీ అజ్జ శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. ఈ విషయం ఎక్కడా బయటికి తెలియలేదు. వైద్య పరికరాల సప్లైలో అజ్జ శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు వైద్యులు తమను చీటింగ్‌ చేశారని జూన్‌లో, శ్రీనివాస్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని జూలైలో షణ్ముగం మహాలింగం లీగల్‌ నోటీసులు పంపించారు. సీఎంసీ వ్యవహారంపై డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ­

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement