మతిస్థిమితంలేని ఏడేళ్ల బాలికపై అత్యాచారం! | - | Sakshi
Sakshi News home page

మతిస్థిమితంలేని ఏడేళ్ల బాలికపై అత్యాచారం!

Dec 14 2024 1:22 AM | Updated on Dec 14 2024 12:01 PM

-

మతిస్థిమితంలేని ఏడేళ్ల బాలికపై అత్యాచారం!

నిందితుడిపై బాధితురాలి బంధువుల దాడి

చికిత్స పొందుతూ మరుసటి రోజు నిందితుడు మృతి

దాడిచేసినవారి ఇళ్లపై మృతుని కుటుంబీకుల దాడి

భారీగా మోహరించిన పోలీసు బలగాలు

రెంజల్‌(బోధన్‌): తాత వయస్సున్న వ్యక్తి మతిస్థిమితం లేని ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేసినట్లు అనుమానించిన బాలిక బంధువులు తీవ్రంగా దా డి చేయడంతో నిందితుడు మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెంజల్‌ మండలం వీరన్నగుట్ట తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక నాయనమ్మతో పక్కనే గల కిరాణా దుకాణానికి వెళ్లింది. బాలిక అక్కడే నిలిచి పోవడంతో వృద్ధురాలైన నా యనమ్మ ఇంటికి చేరుకుంది. కొద్ది సేపటికి బాలిక కోసం తల్లి అక్కడికి వెళ్లింది. బాలికపై దుకాణ యజమాణి రత్నావర్‌ రెడ్యా అత్యాచారం జరిపినట్లు అనుమానించిన తల్లి కుటుంబీకులకు తెలిపింది. 

ఈ క్రమంలో ఇరువురి కుటుంబాల మహిళలు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. బాలిక తండ్రితో పాటు అతని సోద రులు అక్కడికి చేరుకుని రెడ్డ్యాను రొడ్డు పైకి తీసుకొచ్చి తీవ్రంగా చితకబాదారు. కిరాణ దుకాణం ధ్వంసం చేయడంతో పాటు ఇంటిని తగుల బెట్టేందుకు ప్రయత్నించారు. బాలిక బంధువు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో రెంజల్‌ ఎస్సై సాయన్న సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రెడ్యాను ని జామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించిన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్యా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రూరల్‌ సీఐ విజయ్‌, ఎస్సై సాయన్న గ్రామానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

అప్పటికే రెడ్యా మృతి చెందిన సమాచారం అందిన మృతుని బంధువులు దాడికి పాల్పడిన వ్యక్తుల ఇళ్ల పై దాడికి ప్రయత్నించారు. బాలిక తండ్రి ఇంటిని తగుల బెట్టేందుకు పెట్రోల్‌ బాటిల్‌తో రాగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పరిస్థితి విషమించడంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మృతుని కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి పత్తిపాక సాయికిరణ్‌ గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. 

రెడ్యా గతంలో స్థానికంగా వడ్డీలకు ఇస్తుండేవాడని, అతని వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకున్న బాలిక బంధువులు చెల్లించలేక అత్యాచారం చేశాడని చితకబాది హత్య చేశారని ఆరోపించారు. పథకం ప్రకారం దాడి చేసినట్లు బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌కు వివరించారు. రూరల్‌ సీఐతో పాటు నిజామాబాద్‌ సీఐ సురేశ్‌, ట్రాఫిక్‌ సీఐ చందర్‌రాధిడ్‌, ఆర్‌ఐ శ్రీకాంత్‌లతో పాటు సర్కిల్‌ పరిధిలోని నలుగురు ఎస్సైలు అదనపు పోలీసులు గ్రామంలో బందోబస్తులో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement