అనారోగ్యంతో ఏపీడీ తీవ్ర నిర్ణయం.. | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఏపీడీ తీవ్ర నిర్ణయం..

Published Sat, Feb 10 2024 12:42 AM

- - Sakshi

నిజామాబాద్‌: అనారోగ్య కారణాలతో డీఆర్‌డీఏలో ఏపీడీగా పని చేస్తున్న సంజీవ్‌కుమార్‌(57) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్‌ ఎస్సై మహేశ్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సంజీవ్‌కుమార్‌ కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏపీడీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య సింధు, కుమారుడు ఉన్నారు. సంజీవ్‌కుమార్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

ఈ క్రమంలో శుక్రవారం కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్లాడు. తిరిగి విధులకు రాకపోవడంతో సంబంధిత శాఖకు చెందిన డ్రైవర్‌ ఇంటికి వెళ్లి పిలవగా ఎంతకు తలుపు తీయలేదు. దీంతో డ్రైవర్‌ ఏపీడీ భార్యకు సమాచారం అందించాడు. ప్రైవేట్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె వచ్చి కిటికీలో నుంచి చూడగా సంజీవ్‌కుమార్‌ ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఉన్నాడు. తలుపులు బద్దలుకొట్టి కిందికి దించగా అప్పటికే సంజీవ్‌కుమార్‌ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

రెండేళ్ల క్రితం పదోన్నతి
జిల్లాలో ఎంపీడీవోగా సంజీవ్‌కుమార్‌ అందరికీ సుపరిచితులు. గతంలో అనంతపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఆయన పనిచేశారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి, మెపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో ఎంపీడీవోగా సేవలందించి రెండేళ్ల క్రితం జిల్లా ఏపీడీగా పదోన్నతి పొందారు. అందరితో కలుపుగోలుగా ఉండే సంజీవకుమార్‌ ఆత్మహత్యను తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇవి చదవండి: ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌ మోసం చేశాడని ఓ యువతి..

Advertisement
 
Advertisement
 
Advertisement