నిర్మల్చైన్గేట్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి లాగిన్లో నమోదైన ప్రతీ దరఖాస్తుకు నిబంధనల ప్రకారం సముచిత సమాధానం ఇవ్వాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేయాలన్నారు.


