సమ్మె శిబిరంలోనే దీపావళి | - | Sakshi
Sakshi News home page

సమ్మె శిబిరంలోనే దీపావళి

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలోనే ఉద్యోగులు దీపావళి జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లో జరుపుకోవాల్సిన పండుగను తమ భవిష్యత్తు కోసం నిరసన టెంట్‌ కిందనే దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ బాధతో జరుపుకున్నామని ఉద్యోగులు తెలిపారు. తమ కాంట్రాక్ట్‌ జీవితాలనే చీకటిని తొలగించి, ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయడం ద్వారా వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. డిమాండ్లు తీరేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement