న్యూస్‌రీల్
రేపు నిర్మల్‌లో బీఆర్ఎస్ ‘రైతు గర్జన’ హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ జనసమీకరణలో సీనియర్ నేతలు
నిర్మల్
కార్తికం.. శుభప్రదం
శివుడికి ప్రీతికరమైన కార్తిక మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దీపదానాలు, ఉసిరి దానాలు, అర్చనలు, అభిషేకాలకు ప్రాధాన్యతనిస్తారు.
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. ఈ పర్యటనలో గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లు నిశితంగా పరి శీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక వ్యవస్థల సన్నద్ధతను సమీక్షించారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి చిన్నపాటి లోపాలకు కూడా తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎదురులేని శక్తిగా బీఆర్ఎస్ చక్రం తిప్పింది. నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోనూ గులాబీపార్టీ గుత్తాధిపత్యాన్ని చెలాయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ ప్రస్థానాన్ని ఒక్కసారిగా తలకిందులు చేశాయి. జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ మూడు అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. అప్పటి వరకూ ఉన్న కీలక నేతలూ పార్టీని వీడడంతో కేడర్ దిక్కుతోచనిస్థితిలో పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నా.. మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు సంస్థాగతంగా, క్షేత్రస్థాయి నుంచి గులాబీదళాన్ని మళ్లీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపుజెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11న బుధవారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న రైతుగర్జనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఈక్రమంలో గులాబీశ్రేణులన్నీ ఏకమవుతూ సభ విజయవంతానికి శ్రమిస్తున్నాయి.
ఓటమితో తగ్గిన వేగం..
టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న కారు పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బ్రేకులు వేశాయి. నిర్మల్‌లో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్‌లో మాజీ ఎమ్మెల్యే, అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న విఠల్రెడ్డిలతోపాటు, ఖానాపూర్‌లో కేటీఆర్ సన్నిహితుడు, అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుడు జాన్సన్‌నాయక్ పరాజయం చవిచూశారు. ఇది చాలదన్నట్లు.. ఎన్నికల అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో పార్టీకి నాయకత్వలోటు ఏర్పడింది. అధికారం కోల్పోవడం, కీలక నేతలు దూరం కావడంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఖానాపూర్‌లో జాన్సన్‌నాయక్, నిర్మల్‌లో రాంకిషన్‌రెడ్డి, ముధోల్‌లో రమాదేవి, డా.కిరణ్ కొమ్రెవార్, లోలం శ్యాంసుందర్‌తోపాటు ముందునుంచీ ఉన్న సీనియర్‌నేత విలాస్ గాదేవార్ తదితరులు అందుబాటులో ఉన్నప్పటికీ మునుపటి చైతన్యం శ్రేణుల్లో కనిపించడం లేదు.
రైతుగర్జన.. బలప్రదర్శన
ఈనెల 11న కేటీఆర్ పాల్గొననున్న రైతుగర్జన బహిరంగ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రైతు సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడంతోపాటు.. నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని భావిస్తోంది. సభకు భారీగా జనసమీకరణ చేయడం ద్వారా జిల్లాలో తమకు ఇంకా బలమైన కేడర్ ఉందనే సంకేతాలు పోటీపార్టీలకు పంపాలని చూస్తోంది. ఈక్రమంలో పక్క జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ బాల్కసుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్లకు బహిరంగసభ బాధ్యతలు అప్పజెప్పింది. నిర్మల్‌లోనే ఉంటూ స్థానిక నేతలతో కలిసి వారు సభ విజయవంతానికి శ్రమిస్తున్నారు.
పదేళ్లు ఆధిపత్యం..
2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగింది. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో వరుసగా తన పట్టును నిలుపుకుంటూ వచ్చింది. గ్రామస్థాయి వరకూ పార్టీ విస్తరించింది. ప్రభుత్వ పథకాలు, రాజకీయ సమీకరణాలతో ప్రజల్లోనూ మంచి పట్టు సాధించింది. పదేళ్లపాటు అధికారంలో ఉండటం, ఏ ఎన్నికై నా గులాబీదళానిదే గెలుపు కావడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసం కనిపించేది.
‘కారు’లో కొత్త ముఖాలు..
మున్ముందు మళ్లీ బీఆర్ఎస్కే విజయావకాశాలు ఉంటాయన్న ఆశలు కారు పార్టీలో కనిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల పేరు, పరపతి ఉన్న పలువురు కారెక్కడమే కారణం. నిర్మల్ నియోజకవర్గంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, యువనేత నల్ల వినయ్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడం పార్టీకి కొంత ఊరటనిచ్చే పరిణామం. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్తవారిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా పూర్వవైభవం సాధించాలని అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. సభలో, ఆ తర్వాత మరికొందరు పార్టీలో చేరనున్నట్లు గులాబీశ్రేణులు పేర్కొంటున్నాయి.


