ఘనంగా వెలుగుల పండుగ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వెలుగుల పండుగ

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

నిర్మల్‌లో దీపాలతో యువతులు

జిల్లా వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించారు. లక్ష్మీ పూజ చేశారు. ఖాతా బుక్కులకు పూజలు చేశారు. ఈ దీపావళి తమ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని వేడుకున్నారు. తర్వాత చిన్న, పెద్ద అందరూ కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి సహపంక్తి భోజనాలు చేశారు. భైంసాలోని ఎస్‌ఎస్‌ కాటన్‌లోని ఎమ్మెల్యే పి రామారావు పటేల్‌ నివాసంతోపాటు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి నారాయణ్‌రావు పటేల్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.మోహన్‌రావు పటేల్‌ నివాసాల్లో లక్ష్మీ పూజలు చేశారు. – నిర్మల్‌టౌన్‌/భైంసాటౌన్‌

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్‌..

లక్ష్మీపూజలో ఎమ్మెల్యే రామారావు పటేల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement