ఖానాపూర్ మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని ఇప్పమడ గ్రామంలో దీపావళి ఉత్సవాల ముగింపు వేడుకలను ఆదివాసీలు సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతీ ఇంట్లో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటా లక్ష్మీ పూజలు నిర్వహించి కోలాటాలు, గుస్సాడీ నృత్యాలతో సందడి చేశారు. తర్వాత సంప్రదాయం ప్రకారం స్నానాలు ఆచరించారు. గ్రామ పటేల్ ఇంటి వద్ద ఆకీ పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణను విరమించారు. అనంతరం గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆదివాసీలు సహపంక్తి భోజనాలు చేశారు. – ఖానాపూర్


