తీరనున్న సర్పంచుల కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న సర్పంచుల కష్టాలు

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

● జీపీలకు నూతన ఖాతాలు ● చట్ట సవరణతో సంతోషం

లక్ష్మణచాంద: గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల మంజూరీ కోసం సర్పంచులు ట్రెజరీకి పంపి, నిధులు రావడానికి నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించి సర్పంచుల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది.

నూతన ఖాతాలకు ఉత్తర్వులు..

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధుల కోసం కొత్త ఖాతాలు తెరవాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో చట్ట సవరణ ద్వారా ఇకపై జీపీలకు ఈ ఖాతాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులతోపాటు స్థానికంగా వచ్చే పన్నులు కూడా ఈ ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిధులు జమ చేసుకునే విధానం..

జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఈ ఖాతాలు తెరవవచ్చు. 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఫైనాన్స్‌ తదితర నిధులతోపాటు స్థానికంగా వసూలయ్యే ఇంటి పన్నులు, అద్దెలు కూడా ఇందులో జమ చేసుకోవచ్చు. అత్యవసర ప నుల కోసం ఈ నిధులను వెంటనే ఉపసంహరించుకునే సౌలభ్యం కలిగిందని సర్పంచులు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి..

ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బోర్లు, బావుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం, వీధి దీపాల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని సర్పంచులు పేర్కొంటున్నారు.

జిల్లా

సమాచారం...

మొత్తం మండలాలు : 19

మొత్తం గ్రామ పంచాయతీలు :400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement