జైనథ్: మండలంలోని హరియాలి గ్రామ శివారు పెనుగంగ నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మైనింగ్ అధికారుల పక్కా సమాచారంతో మంగళవారం పో లీసులు దాడి చేసి ఇసుక తోడేందుకు వాడుతున్న బోట్, జేసీబీ, టిప్పర్, వాహనం పట్టుకొని సీజ్ చేశారు. నదిలో నీటి ప్రవాహానికి అడ్డుగా బోటుతో ఇసుక తోడటం వల్ల నది గర్భం దెబ్బతినడంతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నది పరీ వాహక గ్రామాల్లో నిత్యం నిఘా ఉంటుందని ఎస్సై గౌతమ్ పవర్ హెచ్చరించారు. కేసు నమోదు చేసుకొని వాహనాలను, సీజ్ చేసినట్లు తెలియజేశారు. తనిఖీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాందాస్, మైనింగ్ అధికారులు, జైనథ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


