డిప్యూటీ డీఎంహెచ్‌వో విచారణ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ డీఎంహెచ్‌వో విచారణ

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

దహెగాం: ‘వైద్యులు, సిబ్బంది లేక కాన్పు చేసిన ఆయమ్మ’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వైద్యాధికారులు స్పందించారు. మండలంలోని అమరగొండ గ్రామానికి చెందిన జునుగరి తులసికి సోమవారం పురిటినొప్పులు రాగా దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆయమ్మ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, డీడీవో సుజీత్‌, పీవో సునీల్‌ మంగళవారం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. వైద్య సి బ్బంది లేకపోవడం, ఆయమ్మ కాన్పు చేయడంపై వివరాలు సేకరించామని, విచారణ నివేదికను జి ల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement