ఆముదపు గింజలు తిని చిన్నారులకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

ఆముదపు గింజలు తిని చిన్నారులకు అస్వస్థత

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని మత్తడిగూడ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు ఆముదపు గింజలు తిని అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్తడిగూడ గ్రామానికి చెందిన ఆత్రం భూమిక, తిరుపతి, మీనాక్షి, సోయం జయ, లక్ష్మి, పెందూర్‌ బందు అనే ఆరుగురు చిన్నారులు ఆడుకుంటూ గ్రామం సమీపంలో ఉన్న ఆముదపు చెట్టు వద్ద గింజలు తిన్నారు. ఇంటికి వచ్చిన తరువాత పిల్లలు వాంతులు కావడం, కడుపునొప్పి ఉందని చెప్పడంతో ఏమైనా తిన్నారా అని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఆముదం చెట్ల వద్ద గింజలు తిన్నట్లు చిన్నారులు పేర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఉట్నూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో సోయం జయ, ఆత్రం భూమిక ఆరోగ్యం కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉట్నూరు ఆసుపత్రిలో చిన్నారులను మాజీ ఎంపీపీ జైవంత్‌రావు, లక్కారం వార్డు మెంబర్‌ జయచంద్రలు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement