రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

వరంగల్‌స్పోర్ట్స్‌: హనుమకొండ జిల్లా ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని జేఎస్‌ఎస్‌లో 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలుర అండర్‌–14 విభాగంలో నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెం విజేతలకు డీఈఓ మెడల్స్‌, బహుమతులు అందజేశారు. పోటీల్లో వరంగల్‌కు చెందిన వర్సా ప్రదీప్‌ 11.50 సెకన్లలో లక్ష్యం చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన ఓం రాజేంద్ర కుంభార్‌ 11.90 సెకన్లతో ద్వితీయ స్థానం, ఆదిలాబాద్‌కు చెందిన షేక్‌ రెహాన్‌ 12.20 సెకన్లతో తృతీయ స్థానం సాధించారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి, అసోసియేషన్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ సొలపోగుల స్వాములు, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement