సాత్నాల: మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో తోట సురేందర్ (43) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మార్గుడా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం ప్ర కారం.. 14 సంవత్సరాల క్రితం తోట సు రేందర్‌కు అదే గ్రామానికి చెందిన మధుశ్రీతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. మున్సిపాలిటీలో డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన కుటుంబంతో జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 24న భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా మధుశ్రీ పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు తల్లిదండ్రుల వద్ద ఉన్న సురేందర్ అక్టోబర్ 26న చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన కుమ్రే లక్ష్మణ్ గ్రామ శివారులోని అ టవీ ప్రాంతం గుండా వెళ్తుండగా మనిషి చనిపోయిన వాసన రాగా గ్రామస్తులకు విషయం తెలిపాడు. గ్రామస్తులు అక్కడికి వెళ్లగా సురేందర్ చెట్టుకు ఉరేసుకొని ఉన్నాడు. పక్కన పొదలో పుర్రె భాగం, దానికి దగ్గరలో వెన్నుపూస, కాళ్ల వరకు శరీరభాగం పడి ఉ న్నాయి. వేసుకున్న చొక్కా ఆధారంగా మృతదేహం సురేందర్‌దేనని తండ్రి గుర్తించాడు. తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ వెల్లడించారు.


