ఆర్జీయూకేటీలో ముగిసిన ఎఫ్‌డీపీ | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో ముగిసిన ఎఫ్‌డీపీ

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● క్వాంటమ్‌ టెక్నాలజీస్‌పై మూడు రోజుల ప్రోగ్రాం

● క్వాంటమ్‌ టెక్నాలజీస్‌పై మూడు రోజుల ప్రోగ్రాం

బాసర: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో మెకానికల్‌ బిల్డింగ్‌, మెకానికల్‌ డిజైన్‌ అండ్‌ సిమ్యులేషన్‌ ల్యాబ్‌లో ‘క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ ఇన్‌ క్వాంటమ్‌ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు’ అనే అంశంపై మూడు రోజులు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) విజయవంతంగా ముగిసింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, ఐఐటీఎం సిడాట్‌ సంజ్ఞ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణలో క్వాంటమ్‌ విద్య, పరిశోధన, పారిశ్రామిక సహకారానికి విశ్వవిద్యాలయాన్ని ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. ప్రారంభోత్సవంలో ఐఐటిఎమ్‌ సిడాట్‌ సంజ్ఞ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌ సిఈఓ డాక్టర్‌ రవీంద్ర బార్లింగే ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. క్వాంటమ్‌ ల్యాబ్‌ల స్థాపన, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ఫెలోషిప్‌లు, ప్రాజెక్ట్‌ ఫండింగ్‌, ఉమ్మడి ఆర్‌అండ్‌డి అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా క్యూకై ్లర్‌వాయన్స్‌ క్వాంటమ్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ కల్నల్‌ (రిటైర్డ్‌) సాయి శంకర్‌ పి సుమారు 40 లక్షల రూపాయల విలువైన 40 అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ లైసెన్సులను ఉచితంగా విశ్వవిద్యాలయానికి అందజేశారు. వీటి ఆధారంగా ఎంపికై న 40 మంది విద్యార్థులకు ఆరు నెలల క్వాంటమ్‌ టెక్నాలజీ సర్టిఫికేషన్‌ కోర్సును ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. ముగింపు కార్యక్రమంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ ప్రతినిధి డాక్టర్‌ కె.మహేష్‌, వారి బృందం చొరవను కొనియాడారు. వేగంగా మారుతున్న భవిష్యత్‌ సాంకేతికతలకు అనుగుణంగా విద్యాసంస్థలు అడుగులు వేయడం అవసరమని నొక్కి చెప్పారు. ఎంపికై న 40 మంది విద్యార్థులకు ఆరు నెలల క్వాంటమ్‌ టెక్నాలజీ సర్టిఫికేషన్‌ కోర్సును పూర్తిగా ఉచితంగా ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో క్వాంటమ్‌ టెక్నాలజీకి ప్రత్యేక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సిఓఈ) ఏర్పాటుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని అకాడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ను ఆదేశించారు. కార్యక్రమ ముగింపులో అతిథులు, నిర్వాహకులను సత్కరించారు. ఈ ఎఫ్‌డీపీ విజయవంతానికి సహకరించిన ఐఐటీఎం సీడాట్‌ సంజ్ఞ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌, జిల్లా కలెక్టర్‌, క్యూకై ్లర్‌వాయన్స్‌ క్వాంటమ్‌ ల్యాబ్స్‌ యాజమాన్యానికి ఆర్జీయూకేటీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమానికి ఎఫ్‌డీపీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.మహేశ్‌, కోఆర్డినేటర్‌ జి.నాగరాజు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి చరణ్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించగా, మెకానికల్‌ విభాగ అధ్యాపకులు, విశ్వవిద్యాలయ పరిపాలక వర్గం సహకారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement