తియ్యనివన్నీ స్వీట్లు కావు..! | - | Sakshi
Sakshi News home page

తియ్యనివన్నీ స్వీట్లు కావు..!

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

● పిండి ముద్దలకు రంగులు అద్ది.. ● కోవా మొదలు నెయ్యి దాకా.. ● నాసిరకం పదార్థాలతో మిఠాయిలు ● తీపి వేడుకలో చేదు ప్రమాదం

నిర్మల్‌: దీపావళి అంటేనే దీపాల వెలుగులు, పటాకుల సందళ్లు వీటితోపాటు ఈ పండుగ మరింత తియ్యటి వేడుక కావాలంటే నోటిని తీపి చేసే స్వీట్లు ఉండాల్సిందే. ఈ పండుగ వేళ బంధుమిత్రులకు స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవా యితీ. ఇంట్లో, దుకాణాల్లో చేసే పూజల్లోనూ మి ఠాయిలు ఉండాల్సిందే. ఈ పండుగ మిఠాయి దుకాణాలకు అతిపెద్ద సీజన్‌. ఏ స్వీట్ల దుకాణా నికి వెళ్లినా ఇప్పుడు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇదే అదనుగా.. కొందరు వ్యాపారులు నాణ్యతతో సంబంధం లేకుండా లాభాలే లక్ష్యంగా స్వీట్ల తయారీ చేపడుతున్నారు. పిండిముద్దలకు రంగులద్ది ఆకర్షణీయమైన మిఠాయిలుగా మార్చేస్తున్నారు. కల్తీ కోవా, నాసిరకమైన నెయ్యి, నాణ్యతలేని నూనెలతో తయారు చేసి అంటగడుతున్నారు. బయటకు చూడటానికి నోరూరించేలా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఆరోగ్యానికి చేటు చేసే పదార్థాలే ఉంటున్నాయి. ఈ క్రమంలో సంబంధిత అధికారులు స్వీట్లపై ఓ కన్నేసి ఉంచాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

సగం ధరకే కోవా

స్వీట్ల తయారీకి కోవా, పాలపదార్థాలు అవసరం. మార్కెట్లో లీటరు పాలు రూ.90 నుంచి రూ. 100. అయితే చాలా స్వీట్‌హోమ్‌లు మహారాష్ట్ర నుంచి వచ్చే రెడీమేడ్‌ కోవాను కిలో రూ.250 నుంచి రూ.300లకే కొని వాడుతున్నారు. ఇంత చౌకగా లభించే కోవా నాణ్యత ప్రశ్నార్థకమే.

పిండి ముద్దలు, రంగుల హంగులు

అసలు ముడిపదార్థాలకు బదులు మైదా లేదా బి య్యం పిండి, చక్కెర, నూనెల మిశ్రమాన్ని ముద్దలుగా చేసి ఆకర్షణీయ రంగులు అద్ది విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. అద్దాల బాక్సుల్లో అందంగా కనిపించే వీటిని వినియోగదారులు ని జమైన మిఠాయిలుగా భావించి కొనుతున్నారు.

నిల్వ చేసినవే అమ్మకం

మిఠాయిలపై కాలపరిమితి ఉండదు. ఫ్రీజర్‌లో వారాల తరబడి నిల్వ చేసి పాతవాటిని కొత్తవిగా అమ్ముతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి సమయంలో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కొత్తవాటితో కలిపి విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement