11న రైతు గర్జన సభ | - | Sakshi
Sakshi News home page

11న రైతు గర్జన సభ

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

నిర్మల్‌టౌన్‌: రైతు సమస్యలపై పోరాటంలో భాగంగా ఈనెల 11న నిర్మల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ రైతు గర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ పాలనలో రైతు రాజులా బతికితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సభ పోస్టర్లు శుక్రవారం ఆవి ష్కరించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, సాగునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని, ప్రస్తుతం యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతుల పక్షాన పోరాడేందుకే ఈ నెల 11న నిర్మల్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుగర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారని తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో రైతులు, యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, మాజీ ఎంపీ బాల్క సుమన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జీలు జాన్సన్‌ నాయక్‌, రాంకిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement