భైంసారూరల్: మండలంలోని మాటేగాం గ్రామంలో అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటా యించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బు ధవారం మాటేగాంలో ఇళ్ల కేటాయింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించి న లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్నారు. అనంత రం భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. విస్తీర్ణం, వస తుల గురించి అధికారుల ద్వారా తెలుసుకుని పలు సూచనలు చేశారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్ తదితరులున్నారు.


