1న ఢిల్లీలో.. 3న గల్లీలో.. | - | Sakshi
Sakshi News home page

1న ఢిల్లీలో.. 3న గల్లీలో..

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలు హస్తిన బాటపట్టిన కాంగ్రెస్‌ శ్రేణులు రేపు ఓట్‌ బచావో– దేశ్‌ బచావో నిరసన 3న జిల్లాకేంద్రంలో బీజేపీ మహా పాదయాత్ర హాజరుకానున్న రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌

నిర్మల్‌

మామిడి.. మెళకువలతోనే రాబడి

మామిడిని తెగుళ్లు ఆశించకుండా, అధిక దిగుబడి సాధించేలా రైతులు యాజమా న్య పద్ధతులు పాటించాలని బెల్లంపల్లి క్లస్టర్‌ ఉద్యానవన శాఖ అధికారి అర్చన తెలిపారు.

మహా పాదయాత్రకు ఏర్పాట్లు

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నవంబర్‌ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర చేపట్టనుంది. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఏర్పాట్లను, హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీ లించారు. ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సల్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై ఎమ్మెల్యే స్థానిక నాయకులతో చర్చించారు. తగు సూచనలు చేశారు. ఏ ర్పాట్లను వేగవంతం చేయాలని నాయకులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌, సీనియర్‌ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రమణారెడ్డి, సరికేల గంగన్న, శ్రీనివాస్‌, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్‌, జింక సురేందర్‌, ఈశ్వర్‌, కూన శశాంక్‌, సూరజ్‌నాయక్‌, నాయకులు కందుల హరీశ్‌, భరత్‌, సాయి పాల్గొన్నారు.

నిర్మల్‌: జాతీయ స్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ శ్రేణులు ‘చలో ఢిల్లీ’ అంటూ జాతీయ నిరసనకు తరలివెళ్తుండగా, బీజేపీ జిల్లాకేంద్రంలో మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

పోటాపోటీ కార్యక్రమాలు..

కాంగ్రెస్‌ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఢిల్లీ నిరసనను విజయవంతం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి శ్రేణులను తరలించారు. మరోవైపు బీజేపీ సోషల్‌ మీడియా నుంచి బయటకు వచ్చి నేరుగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం, నిర్మల్‌ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత కావడంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మళ్లీ రాజకీయ ఉద్రిక్తత..

సర్పంచ్‌ ఎన్నికల తర్వాత తగ్గిన రాజకీయ ఉద్రిక్తత ‘ఓటు చోరీ’ అంశంతో మళ్లీ పెరిగింది. కాంగ్రెస్‌ ఢిల్లీకి శ్రేణులను తరలించి స్థానికంగా ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని భావిస్తే, బీజేపీ ఎక్కడికక్కడ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. రెండు పార్టీలు భారీ కార్యక్రమాలు చేపడుతుండటంతో జిల్లాలో మళ్లీ రాజకీయ సందడి కనిపిస్తోంది.

ఢిల్లీకి ధీటుగా బీజేపీ ఏర్పాట్లు..

కాంగ్రెస్‌ చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ సన్నద్ధమైంది. రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. హైదరాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – విద్రోహులను తరిమికొట్టుదాం’ పేరిట భారీ జనసమీకరణ చేయనుంది. నిర్మల్‌లో నవంబర్‌ 3న మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందులో బీజేపీ జాతీయ నేత, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణలో తొలి కార్యక్రమం కావడంతో స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.

హస్తిన బాటలో హస్తం నేతలు..

‘ఓటు బచావో – దేశ్‌ బచావో’ పేరిట నవంబర్‌ 1న(ఆదివారం)ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ నిరసనకు జిల్లా నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు తరలివెళ్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌, మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌ రెడ్డి, నారాయణరావు పటేల్‌, యువ నేతలు అప్పాల గణేశ్‌చక్రవర్తి, అర్జుమంద్‌ అలీ తదితరులు తమ పరిధిలోని సర్పంచులు, నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి పంపుతున్నారు. ఇప్పటికే నిర్మల్‌ నియోజకవర్గం నుంచి పలు బస్సుల్లో నాయకులు బయలుదేరారు. గ్రూపుల వారీగా తరలిస్తుండటంతో జిల్లా నుంచి ఎంతమంది పాల్గొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement