భైంసాటౌన్:పట్టణంలోని దుకాణదారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని కమిషనర్ జాదవ్ సంతోష్‌కుమార్ అన్నారు. పలు దుకాణ సముదాయాల్లో ట్రేడ్ లైసెన్సులను శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలని, గడువు ముగిసినవారు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని తెలిపారు. అంతకుముందు ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సమస్యలపై పలు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయొద్దని, నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించుకోవాలని సూచించారు. ఆయన వెంట మెప్మా టీఎంసీ దత్తాత్రి, శానిటరీ ఇన్స్పెక్టర్ జాదవ్ మురహరి, పర్యావరణ ఇంజినీర్ మన్మోహన్, రాథోడ్ కృష్ణ ఉన్నారు.


