నిర్మల్‌టౌన్: విద్యార్థులు కళా నైపుణ్యాలు, ప్రజా స్వామ్య విలువలు పెంచుకోవాలని, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని జిల్లా విద్యాధికారి భోజన్న సూ చించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి పీఎంశ్రీ మాక్ పా ర్లమెంట్, స్పెల్ బీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ పోటీలు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మాక్ పార్లమెంట్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన, స్పెల్ బీ ద్వారా ఆంగ్ల భాషా పరి జ్ఞానం, కళా పోటీల ద్వారా సృజనాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి స త్కరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ నర్స య్య, రామ్‌నరేశ్, సాయికిరణ్, రాఘవేంద్ర, కిశోర్, భూషణ్, వేణుగోపాల్, రతన్, రాజేశ్వర్, రవీందర్, సంజయ్, గోదావరి, సౌజన్య, శ్రీజ, రవికిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పోటీల విజేతల వీరే..
మాక్ పార్లమెంట్‌లో ఆర్.వైష్ణవి (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ నచ్చనిల్లాపూర్, కడెం), వైష్ణవి (టీజీఎంఎస్ కుంటాల), ఖుషి (జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. స్పెల్ బీలో తరుణశ్రీ (టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ లెఫ్ట్ పోచంపాడు), జి.నైతిక (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ముధోల్), కార్తికేయ (టీజీఎంఎస్ కుంటాల), ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగం జానపద గీతా లాపనలో జె.సాహితి (కేజీబీవీ దస్తురాబాద్), దిశ (హెచ్‌ఎస్ గర్ల్స్ నిర్మల్), కె.అక్షర (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జామ్), జానపద నృత్యంలో జి.అమూల్య (కేజీబీవీ దస్తురాబాద్), జె.చిన్మయి (జీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జామ్), టి.లక్ష్మి (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ లెఫ్ట్ పోచంపాడు), పెయింటింగ్‌లో సీహెచ్.వర్షిణి (ఎల్లాపూర్), జె.నందిని (కేజీబీవీ కుభీర్), పి.చందన (జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మణచాంద), క్రాఫ్ట్‌లో ఈ.దీప (కేజీబీవీ కుభీర్), వి.మహిక (జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మణచాంద), ఎస్కే.రియాన్ (జెడ్పీహెచ్‌ఎస్ దిలావర్‌పూర్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బహుమతులు గెలుచుకున్నారు.


