నిర్మల్‌టౌన్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్ సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఇండియన్‌రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మద్యం, గుట్కా, సిగరెట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, గురువుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో రాజేందర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ఎంసీ లింగన్న, కోశాధికారి అల్లాడి రవి, రాష్ట్ర డైరెక్టర్ రాఘవులు, జిల్లా డైరెక్టర్లు షేక్ ముజాహిద్, నాగభూషణం, అయ్యన్నగారి భూమయ్య, సాయన్న, విద్యార్థులు పాల్గొన్నారు.


