చట్టాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

కడెం: మండలంలోని లింగాపూర్‌ జిల్లా పరిష త్‌ సెకండరీ పాఠశాలలో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాలబా లికలకు చట్టపరమైన హక్కులు, రక్షణ, ఆరో గ్యం తదితర అంశాలపై జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ రవీందర్‌ అవగాహన కల్పించారు. అకృత్యాలను ఎలా ఎదుర్కోవాలి, పోలీ సులను సంప్రదించి సాయం పొందే విధానం గురించి దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 1098, ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే 1830 నంబర్లను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా బాలికల ఆరో గ్యపరమైన చర్యలను వివరించే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, ఎస్సై సాయికిరణ్‌, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌, సర్పంచ్‌ కుమ్మరి రంజిత్‌, ఉపసర్పంచ్‌ కమ్మల లక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌లో గల జెడ్పీహెచ్‌ఎస్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం–2012 (పోక్సో)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement