ఇరిగేషన్‌ భూముల ఆక్రమణను సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ భూముల ఆక్రమణను సహించేది లేదు

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణంలోని ధర్మసాగర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలను కలెక్టర్‌ మంగళవారం స్వయంగా పరిశీలించారు. చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని, మ్యాపులను పరిశీలించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ధర్మసాగర్‌ చెరువు వద్ద అనధికారికంగా నిర్మించిన లేఅవుట్‌ ఫెన్సింగ్‌ గోడను అధికారులు కూల్చివేశారు. వెంచర్‌ నిర్మాణ పనులకు వినియోగిస్తున్న యంత్రాలు, సామగ్రి, ఇసుక తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని నీటిపారుదల శాఖ భూములు, చెరువుల పరిధిలో ఆక్రమణలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట నీటిపారుదల శాఖ ఈఈ అనిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, తహసీల్దార్‌ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement