శ్రీవారి రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి రథయాత్ర

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో జుర్జాపూర్‌ వీదులన్నీ మార్మోగాయి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్‌ రాథోడ్‌ స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ అధ్యక్షుడు తునికి మహేందర్‌, సర్పంచ్‌ బక్కశెట్టి వెంకటరాములు వారికి సన్మానం చేశారు. – ఖానాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement