యోగా దినోత్సవం సందర్బంగా భారత ప్రధాని వీడియో సందేశం 

Yoga Has Become Global Movement With International Yoga Day - Sakshi

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. 

ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. 

ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు.  

అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్‌ మస్క్‌    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top