నేను మోదీ అభిమానిని.. భారత్‌కు ఆయన సరైందే చేస్తున్నారు: మస్క్‌

PM Modi US Visit: Elon Musk Says He Is Fan Of Modi - Sakshi

న్యూయార్క్‌: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో.. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో-ట్విటర్‌ యజమాని ఎలన్‌ మస్క్‌ భేటీ అయ్యాడు. మూడు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మోదీ మోదీ నినాదాల మధ్య ఘన స్వాగతం లభించింది ఆయనకు అక్కడ.

ఈ క్రమంలో న్యూయార్క్‌లోనే ప్రధాని మోదీతో ఎలన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. భారత భవిష్యత్తు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అగ్రదేశాలతో పోలిస్తే భారత్‌కు అభివృద్ధి విషయంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఆయన(ప్రధాని మోదీని ఉద్దేశించి..) భారత్‌ పట్ల నిజమైన శ్రద్ధ వహిస్తున్నారు. పెట్టుబడుల విషయంలో సరైన సమయంలో ప్రకటన చేస్తాం. 

ప్రధాని మోదీతో సమావేశం ఎంతో అద్భుతంగా సాగింది. చాలా ఏళ్ల కిందట ఆయన మా ఫ్యాక్టరీని సందర్శించారు. అలా మా పరిచయం మొదలైంది. భారత్‌కు ఆయన సరైందే చేస్తున్నారు. ఆయనకు నేను అభిమానిని. భారత్‌లో సౌర శక్తి పెట్టుబడులకు ఎంతో ఆస్కారం ఉంది. అందుకే స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ను తీసుకెళ్లాలనుకుంటున్నాం. భారత్‌లో పర్యటిస్తా.. వచ్చే ఏడాది అది ఉండొచ్చు. అంతేకాదు.. టెస్లాను కూడా భారత్‌కు తీసుకెళ్తాం అని మస్క్‌, భారత ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాకు వివరించారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ యుద్ధం.. కుండబద్ధలు కొట్టిన మోదీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top