షాపింగ్‌కు వచ్చి.. సీసీటీవీలో గుట్టురట్టు | Woman Caught Stealing Ghee And Refined Oil From Noida Mall | Sakshi
Sakshi News home page

షాపింగ్‌కు వచ్చి.. సీసీటీవీలో గుట్టురట్టు

Oct 6 2026 7:34 AM | Updated on Oct 6 2026 8:00 AM

Woman Caught Stealing Ghee And Refined Oil From Noida Mall

నోయిడాలోని డీఎల్‌ఎఫ్ మాల్‌ని ఓ స్టోర్‌లో నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సిబ్బంది పట్టుకున్నారు. సీసీటీవీలో చోరీ బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సెక్టార్ 18లోని మాల్‌లో ఉన్న ‘లే మార్చే’ స్టోర్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

ఆ మహిళ నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిళ్లను తన బ్యాగ్‌లో దాచుకుని స్టోర్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. ఆమెను స్టోర్ ఎగ్జిట్ సమీపంలో అడ్డుకుకున్నారు. వీడియోలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆ మహిళను మాల్ లోపలికి తీసుకెళ్తుండగా, ఆమె తన ముఖాన్ని ఫోన్‌తో కప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. స్టోర్‌కు సంబంధించిన వ్యక్తిగా భావిస్తున్న ఓ వ్యక్తి కూడా ఆమెను ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఆ మహిళ గత నెల రోజులుగా స్టోర్‌కు వస్తూ ఉండేదని.. గతంలోనూ పలుమార్లు వస్తువులను దొంగిలించినట్లు అనుమానం ఉందని సిబ్బంది పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో గతంలో జరిగినట్లు అనుమానిస్తున్న దొంగతనాలను కూడా గుర్తించినట్లు ఓ ఉద్యోగి తెలిపారు. గతంలో కూడా ఆ మహిళ వేల రూపాయల విలువైన నెయ్యి, ఇతర కిరాణా వస్తువులను తీసుకెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఇదీ చదవండి: బొమ్మ.. బాంబుగా మారింది..!

ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నెయ్యి, వంట నూనె వంటి రోజువారీ అవసరాల వస్తువులను ఎందుకు దొంగిలిస్తారని పలువురు ప్రశ్నించారు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు ఆమెకు ‘క్లెప్టోమేనియా’ అనే మానసిక ఆరోగ్య సమస్య ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. క్లెప్టోమేనియా అంటే వస్తువులను దొంగిలించాలనే నియంత్రించలేని ప్రేరణ కలిగించే ఒక మానసిక రుగ్మత. అయితే, ఈ ఘటనపై పూర్తి స్పష్టత రాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement