ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని.. | Woman With 3 Children Marries Class 12 Student In UP | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లులున్నా.. భర్తను కాదని.. ఇంటర్‌ విద్యార్థితో ప్రేమ..

Apr 10 2025 7:44 AM | Updated on Apr 10 2025 8:45 AM

Woman With 3 Children Marries Class 12 Student In UP

లక్నో: ఆమె వయసు 30ఏళ్లు.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం, మతం మార్చుకుని 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వివాహానికి యువకుడి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోకి చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యూపీలోని అమ్రోహా జిల్లాలోని సైదాన్‌వాలిలో నివసిస్తున్న షబ్నమ్‌కు తల్లిదండ్రులు లేరు. ఆమెకు మొదట మీరట్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం, కొన్ని కుటుంబ కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత ఆ గ్రామానికి చెందిన తౌఫిక్‌తో ఆమెకు రెండో వివాహమైంది. అయితే 2011లో రోడ్డు ప్రమాదం వల్ల అతడు వికలాంగుడయ్యాడు. దీంతో, తాజాగా 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శివతో ప్రేమలో పడింది. దీంతో, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 4న వికలాంగుడైన భర్త తౌఫిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలోకి మారింది. షబ్నమ్‌ పేరును కాస్తా.. శివానీగా మార్చుకున్నది. ఈ క్రమంలో స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం విద్యార్థి శివను పెళ్లాడింది. మరోవైపు శివానీతో తన కుమారుడి పెళ్లిని శివ తండ్రి దాతారామ్ సింగ్ స్వాగతించాడు. తన కొడుకు నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపాడు.  ఆ జంట సంతోషంగా ఉంటే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పాడు.

ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిషేధిత చట్టం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement