మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు! | Mob Attacks West Bengal Woman In Bengaluru Varthur Over Allegations Of Illegal Activity, More Details Inside | Sakshi
Sakshi News home page

మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు!

Apr 7 2026 11:10 AM | Updated on Apr 7 2026 12:51 PM

west bengal women Incident

కర్ణాటక: పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్‌ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా     కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement