చొరవ తీసుకున్నాం  | We have conversations with both Russia and Ukraine says EAM Jaishankar | Sakshi
Sakshi News home page

చొరవ తీసుకున్నాం 

Oct 5 2026 5:57 AM | Updated on Oct 5 2026 5:57 AM

We have conversations with both Russia and Ukraine says EAM Jaishankar

రష్యా, ఉక్రెయిన్‌లతో నేరుగా చర్చలకు ప్రయత్నించాం 

విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: యుద్ధాల వేళ ఇరుపక్షాలు దౌత్యం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని హితబోధ చేసే బదులు తొలిసారిగా నేరుగా చర్చలకు భారత్‌ ప్రయత్నించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు కోసం భారత్‌ చొరవ చూపిందని ఆ దేశం బహిరంగంగా ఒప్పుకోవడం ఇదే తొలిసారి.  మంత్రి జైశంకర్‌ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. 

 రష్యాతో మాత్రమే భారత్‌ ఎందుకు అత్యంత స్నేహంగా ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ తనదైన రీతిలో బదులిచ్చారు. ‘‘దేశ భద్రత, భౌగోళిక సమగ్రత ప్రమాదంలో పడినప్పుడు ఒక్క రష్యానే మాకు అండగా నిలిచింది. అందుకే దశాబ్దాలుగా రష్యాతోనే భారత్‌ అత్యంత స్నేహంగా ఉంటుంది. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో మాకు రష్యా మద్దతిచ్చింది.

 అప్పట్లో పాక్‌కు అండగా అమెరికా బంగాళాఖాతంలోకి నావికా దళాన్నే పంపించింది’ అని గుర్తు చేశారు. ‘అప్పట్నుంచి రష్యాతో సంబంధాలు క్రమంగా బలపడుతూ వచ్చాయి. కేవలం ఆర్థికమే కాదు, సైనిక సామగ్రి సాయం, అణు కేంద్రాల ఏర్పాటు, అంతరిక్ష రంగంలో తోడ్పాటు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన వనరులు..ఇలా అన్ని రంగాల్లో బంధం బలపడింది’’ అని వివరించారు.   
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement