యూపీలో హిట్‌ అండ్‌ రన్‌.. మైనర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు మహిళ బలి | Watch Video: UP Woman Killed Daughter Critical As Minor Rams Car Into Scooter, More Details Inside | Sakshi
Sakshi News home page

యూపీలో హిట్‌ అండ్‌ రన్‌.. మైనర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు మహిళ బలి

Aug 3 2024 3:35 PM | Updated on Aug 3 2024 5:25 PM

Video: UP Woman Killed Daughter Critical As Minor Rams Car Into Scooter

ఉత్తర ప్రదేశ్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు వెలుగుచూసింది. మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్‌పైనున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కూతురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.

ఈ ఘటన కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. మైనర్‌ అయిన డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ఉన్న మహిళ, చిన్నారి గాల్లోకి ఎగిరి దూరం పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మహిళ మృతిచెందినట్లు ప్రకటించారు. చిన్నారి గాయాలతో చికిత్స పొందుతుంది.

 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. 17 ఏళ్ల మైనర్‌ బాలుడు కారు నడిపినట్లు తెలిపారు. రోడ్డుపై స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement