యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | UPSC declares Civil Services Prelims result, over 13300 candidates qualify | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Jun 15 2026 11:15 PM | Updated on Jun 15 2026 11:15 PM

UPSC declares Civil Services Prelims result, over 13300 candidates qualify

మెయిన్స్‌కు అర్హుల జాబితా ప్రకటించిన కమిషన్‌

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో ఒకటైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (UPSC) సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 13,343 అభ్యర్థుల రోల్‌ నంబర్ల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 8,19,372 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు  తదుపరి దశ అయిన మెయిన్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement