డీజే వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురి మృతి | Truck Rams Into Mini Goods Vehicle In Chhattisgarh Balod | Sakshi
Sakshi News home page

డీజే వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురి మృతి

Sep 25 2026 6:11 PM | Updated on Sep 25 2026 6:49 PM

Truck Rams Into Mini Goods Vehicle In Chhattisgarh Balod

బాలోద్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలోద్‌ జిల్లాలోని పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

ధమతరి-కంకేర్ మధ్య మార్కటోలా ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీజే సిస్టమ్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు.. వరి ధాన్యం లోడుతో ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కుతో పాటు డీజే సిస్టమ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement