breaking news
Balod district
-
డీజే వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురి మృతి
బాలోద్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలోద్ జిల్లాలోని పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.ధమతరి-కంకేర్ మధ్య మార్కటోలా ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీజే సిస్టమ్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు.. వరి ధాన్యం లోడుతో ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కుతో పాటు డీజే సిస్టమ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం -
అన్నయ్య అని కూడా చూడకుండా..
రాయపూర్: తన నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో సోదరుడిని ముక్కలుగా నరికేశాడో దుర్మార్గుడు. ఛత్తీస్ గఢ్ బాలోద్ జిల్లా దాండిలొహ్రా గ్రామంలో ఈ దిగ్భ్రాంతికర చోటుచేసుకుంది. పట్టపగలు గ్రామస్తులందరూ చూస్తుండగా ఈ కిరాతానికి ఒడిగట్టాడు. నిందితుడు సురేశ్ కుమార్.. మాంగ్ చువా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన గురించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం తమ ఇంట్లో సురేశ్ కుమార్(40), అతడి అన్నయ్య చింతురామ్(45) నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో చింతురామ్ పాటలు పాడడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ రేగి అతడిని సురేశ్ కొట్టాడు. తర్వాత బయటకు వెళ్లి గొడ్డలి తీసుకొచ్చి తమ్ముడిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. చింతురామ్ దగ్గర నుంచి గొడ్డలిని లాక్కుకుని అతడిని బయటకు ఈడ్చుకెళ్లాడు. కరెంట్ స్తంభానికి కట్టేసి గ్రామస్తులందరూ చూస్తుండగా అన్నను ముక్కలుగా నరికాడు. ఎవరైనా కల్పించుకుంటే చంపేస్తానని బెదిరించడంతో అతడిని ఆపేందుకు స్థానికులు సాహసించలేకపోయారు. ఈ ఘటనలో సురేశ్ కుమార్ తలకు, చేతికి గాయాలయ్యాయి. అన్నదమ్ములు, వారి భార్యలు తరచుగా గొడవ పడుతుంటారని గ్రామస్తులు తెలిపారు. తన దురుసు ప్రవర్తనతో గతంలోనూ సురేశ్ ఇబ్బందులు సృష్టించాడని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


