వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్‌’ బాదుడు | Toll Fee To Rise From Today Midnight | Sakshi
Sakshi News home page

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్‌’ బాదుడు

Jun 2 2024 6:51 PM | Updated on Jun 2 2024 6:51 PM

Toll Fee To Rise From Today Midnight

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్‌ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఐఏ) వెల్లడించింది.

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్‌ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని  జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఐఏ) వెల్లడించింది. టోల్‌ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ ఛార్జీలు పెరగనున్నాయి.

టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్‌హెచ్ఐఏ తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది.

ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement