టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Telugu News Headlines 17th December 2020 | Sakshi
Sakshi News home page

టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Dec 17 2020 8:31 AM | Updated on Dec 17 2020 11:22 AM

Today Telugu News Headlines 17th December 2020 - Sakshi

టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు
రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు, తిరుపతి ఉపఎన్నిక కోసమే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పూర్తి వివరాలు..

తెలంగాణలో చిచ్చు రేపుతున్న పీసీసీ చీఫ్‌ ఎంపిక
తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియామకానికి సంబంధించిన ప్రక్రియ పార్టీలో చిచ్చు రాజేస్తుంది. ఇప్పటికే పదవి కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. పూర్తి వివరాలు..


వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. పూర్తి వివరాలు..

నేను ఎంజీఆర్‌ రాజకీయ వారసుడ్ని: కమల్‌

దివంగత ఎంజీఆర్‌ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు..

9 రాష్ట్రాలకు కొత్త సీజేలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. పూర్తి వివరాలు..

సత్వరమే పోలవరం ఫలాలు

జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సవరించిన వ్యయ అంచనాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.  పూర్తి వివరాలు..

ధరణిలో ప్రక్రియ షురూ.. తహసీల్దార్లకు లాగిన్‌ ఆప్షన్‌

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్‌సైట్‌ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు..

నిరసన గళం వారిదే

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. పూర్తి వివరాలు..

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ50 ప్రయోగం
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వివరాలు..


రైతులకు మద్దతుగా ఆత్మహత్య

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్‌ బాబా రామ్‌ సింగ్‌(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు..

సంక్రాంతికి 1,500 ఆర్టీసీ బస్సులు!

ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది.  పూర్తి వివరాలు..

మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు

మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు నమోదు చేసినట్టు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.  పూర్తి వివరాలు..

సినిమా కోసం కదలి వచ్చిన ఊళ్లు

మారేడుమిల్లి అటవీ ప్రాంతం భాగ్యనగరానికి వచ్చింది. నేను కూడా అంటూ ఇటలీ వచ్చేసింది. నేనూ వస్తా అంటూ అమెరికా వచ్చింది.  పూర్తి వివరాలు..

‘పింక్‌’ సమరం..

అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.  పూర్తి వివరాలు..

స్పెక్ట్రమ్‌ వేలానికి సై!

దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్‌ స్పెక్ట్రమ్‌ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది.  పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement