
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉంది. అది టొరంటోలోని ఓ మూలగా ఉన్న కిరాణా దుకాణంలో కనిపిస్తుంది, బెర్లిన్ లోని ఒక టెక్ సంస్థకు గుండెకాయగా మారుతుంది. సందడిగా ఉండే దుబాయ్ మెట్రోలో లేదా న్యూయార్క్ టైమ్స్ బైలైన్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే..భారతీయ పౌరులు నివసించాలని నిర్ణయించుకునే దేశంలో సులభంగా కలిసిపోతారు.
నేడు, గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జన్మస్థలం వెలుపల నివసిస్తున్నారు. ప్రపంచంలోని 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులలో, భారతీయులు అతిపెద్ద సింగిల్ గ్రూపుగా ఏర్పడ్డారు, దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన వారిని కూడా చేరిస్తే ఆ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది.
అగ్రరాజ్యం...అగ్రస్థానంలో..
టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విపరీతమైన అవకాశాల కారణంగా దాదాపు 5.4 మిలియన్లకు పైగా భారతీయులతో, మనవాళ్లను ఆకర్షించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇంకా, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు కూడా దీనికి దోహదం చేశాయి. ఎడిసన్ (ఎన్‌జె), జాక్సన్ హైట్స్ (ఎన్‌వై), ఆర్టీసియా (సిఎ) వంటి ప్రాంతాలను తరచుగా ‘లిటిల్ ఇండియాస్‘ అని పిలుస్తారు ఇవి వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు సాంస్కృతిక కేంద్రాలతో నిండి ఉంటాయి.
70 శాతం శ్రామిక శక్తి మనదే..
3.57 మిలియన్ల మంది భారతీయులతో యుఎఇ రెండో అతిపెద్ద భారతీయ నివాస దేశం. నిర్మాణం, ఆతిథ్యం,ఆర్థిక రంగాలలో పన్ను రహిత జీతాలు బ్లూ, వైట్ కాలర్ కార్మికులను ఆకర్షిస్తాయి; దుబాయ్ శ్రామిక శక్తిలో 70 శాతానికి పైగా భారతీయులే కావడం గమనార్హం.
మేలు కలయిక...మలేషియా
నేడు, మన దేశస్థులు మలేషియా మొత్తం జనాభాలో 9% మంది భారతీయులే ఉన్నారు. దాదాపుగా 2.75మిలయన్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని అంచనా. తమిళం, మళయాళం, తెలుగు, పంజాబీ భాషలు మాట్లేడేవారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరే కాకుండా ఇండియన్ ఎక్స్‌పాట్స్ (అక్కడ స్థిరపడనివారు) సైతం 2.25లక్షల మంది వరకూ ఉంటారని అంచనా.
ఇండియన్స్ కేరాఫ్...కెనడా
కెనడాలో దాదాపు 2.88 మిలియన్ల భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు. టొరంటో (700,000 కంటే ఎక్కువ మంది భారతీయులు) వాంకోవర్ వంటి ప్రధాన కేంద్రాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు బాలీవుడ్ చలనచిత్రోత్సవాలను సైతం ఇక్కడ నిర్వహిస్తు న్నారు.
3వేల వ్యాపారాలు మనవే...సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలో దాదాపు 2.46 మిలియన్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు, ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023–24లో ఈ సంఖ్య 200,000 పెరిగింది, ఇది నిర్మాణం, మౌలిక సదుపాయాలు సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో డిమాండ్‌లో పదునైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, భారతీయ వ్యాపారాల ఉనికి విస్తరించింది, ఇప్పుడు 3,000 కంటే ఎక్కువ నమోదిత భారతీయ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి, ఇది రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.
స్టడీస్‌కి స్టార్ డమ్...యునైటెడ్ కింగ్ డమ్
భారతీయ సంతతికి చెందిన 1.86 మిలియన్ల మందికి నిలయంగా ఉన్న యుకె 40 శాతం కంటే ఎక్కువ మంది లండన్ బారోగ్స్, లీసెస్టర్ బర్మింగ్‌హామ్‌లలో నివసిస్తున్నారు, చిన్నపాటి వ్యాపారాలు ఫైనాన్స్, వైద్య రంగాలలో ఉన్న నిపుణులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోస్తున్నారు. భారతీయ విద్యార్థులు (సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ మంది) టైర్ 4 వీసాలపై అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు హాజరవుతారు.
మన వ్యాపార ఆధిపత్యం దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 19వ శతాబ్దపు నాటల్ చెరకు తోటలకు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. ఆధునిక వలసదారులలో ఇంగ్లీష్ మీడియం విద్య కేప్ టౌన్‌లోని అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కేంద్రాల ద్వారా ఆకర్షించబడిన వైద్యులు ఐటీ నిపుణులు ఉన్నారు. డర్బన్ లోని స్థానిక రిటైల్ బిజినెస్‌లో భారతీయ యాజమాన్యంలోని వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అయితే తమిళ గుజరాతీ భాషా విద్య కోసం వార్షిక బడ్జెట్‌లు 10 మిలియన్లకు మించింది.
ఉమ్మడి చరిత్రతో...శ్రీలంక
శ్రీలంక లో 1.61 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు ఇది టీ, పర్యాటక ఐటీ రంగాలలో ఆధునిక కాంట్రాక్ట్ ఉద్యోగులను మిళితం చేస్తుంది. ఉమ్మడి తమిళ సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి సజావుగా మారడానికి సహాయపడుతుంది. మరోవైపు, కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ జోన్ భారతీయ ఫిన్‌టెక్ నిపుణులను ఆకర్షిస్తుంది.
జనాభాలో 20శాతం.. కువైట్
కువైట్‌లో దాదాపు 995,000 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాని జనాభాలో 20 శాతానికి పైగా మనమే ఉన్నాం అన్నమాట. మనవాళ్లలో అత్యధికులు అక్కడ చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు గృహ రంగాలలో పనిచేస్తున్నారు.
దీపావళికి ‘దియా’...ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో 976,000 మంది భారతీయులు ఉన్నారు. అర్హతలు ఆంగ్ల నైపుణ్యానికి విలువనిచ్చే పాయింట్ల ఆధారిత నైపుణ్య వలస కార్యక్రమం కింద ఇక్కడ వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఏటా 120,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ ఐటీలలో చేరుతున్నారు, ట్యూషన్ ఫీజుగా 5 బిలియన్లను అందిస్తున్నారు. మెల్‌బోర్న్ సిడ్నీ వంటి నగరాల్లో భారతీయ వాణిజ్య మండలులు, యోగా స్టూడియోలు కనిపిస్తాయి. ఇక దీవాళి స్ట్రీట్ ఫెయిర్స్ సైతం అక్కడ .చురుకుగా జరుగుతున్నాయి.