సైక్లోన్ మోంథా ప్రభావంతో విశాఖ సాగర తీరం నిర్మానుష్యంగా మారింది. రాకాసి అలలు ఎగసిపడుతూ, భారీ ఈదురు గాలులతో భయానక వాతావరణం నెలకొంది. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుపాను తీరం దాటే సమయానికి ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.


