టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి

SUV Car Rammed Several Vehicles At Bandra Worli Sea Link - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రావైపు వెళ్తున్న ఇన్నోవా కారు పలు వాహనాలను బలంగా ఢీకొంది. వర్లీలో సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. 

అయితే, మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్టు తెలిపారు. ఇక,  గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top