విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్ర  | A suspected terror plot was foiled by the Mumbai Police | Sakshi
Sakshi News home page

విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్ర 

Jun 29 2026 4:32 AM | Updated on Jun 29 2026 4:32 AM

A suspected terror plot was foiled by the Mumbai Police

ఎలుకల మందుతో మాత్రల తయారీ  

ముంబై మొహర్రం ఊరేగింపులో పంపిణీ యత్నం  

నిందితుడు ఫయాజ్‌ అరెస్ట్‌  

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా కనీసం 15,000 మందిని  చంపేయడానికి కుట్ర పన్నిన ఫయాజ్‌ ప్రేమ్‌జీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్‌ ఫాస్పైడ్‌ అనే రసాయనంతో వేలాదిగా విషపూరిత మాత్రలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

మొహర్రం ఊరేగింపులో పాల్గొనే జనానికి వీటిని పంచాలని ప్లాన్‌ చేశాడు. ఈ మాత్రలు నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నమ్మబలుకుతూ కొందరికి స్వయంగా పంపిణీ చేశాడు. అలాగే చాక్లెట్లు అని చెబుతూ జనంపైకి విసిరేశాడు. ఆ మాత్రలను మింగిన బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాత్రలను ఉచితంగా పంచడంపై అనుమానం వచ్చిన ఓ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో పోలీసులు శనివారం నిందితుడు ఫయాజ్‌ ప్రేమ్‌జీని అరెస్టు చేశారు. అతడి వద ్దనుంచి 15,000 విషపూరిత మాత్రలను స్వా«దీనం చేసుకున్నారు. ప్రేమ్‌జీ ఇచ్చిన మాత్రలను తీసుకున్నవారిలో 11 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.  ఫయాజ్‌ పుణేలోని విమాన్‌ నగర్‌లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించాడు. 

గొడవల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. పెయింటింగ్‌ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2019 నుంచి 2025 దాకా ఇరాన్, ఇరాక్‌లో పలుమార్లు పర్యటించి వచ్చాడు. అతడి తల్లి, సోదరి ఇరాన్‌లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇరాన్, ఇరాక్‌లకు 19 సార్లు వెళ్లొచ్చాడు. అతడి ఆర్థిక లావాదేవీలు, మొబైల్‌ ఫోన్‌ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

15,000 మంది హత్య చేయాలన్న ఆలోచన అతడిదేనా? లేక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్‌ ఏకంగా 50 కిలోల జింక్‌ ఫాసై్పడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్‌ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటిదాకా 15,000 క్యాప్సూల్స్‌లో ఒక్కో గ్రాము చొప్పున జింక్‌ ఫాసై్పడ్‌ను నింపాడు. మొత్తం 30,000 విషపు క్యాప్సూల్స్‌ తయారు చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement