breaking news
Muharram procession
-
విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్ర
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా కనీసం 15,000 మందిని చంపేయడానికి కుట్ర పన్నిన ఫయాజ్ ప్రేమ్‌జీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్పైడ్ అనే రసాయనంతో వేలాదిగా విషపూరిత మాత్రలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొహర్రం ఊరేగింపులో పాల్గొనే జనానికి వీటిని పంచాలని ప్లాన్ చేశాడు. ఈ మాత్రలు నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నమ్మబలుకుతూ కొందరికి స్వయంగా పంపిణీ చేశాడు. అలాగే చాక్లెట్లు అని చెబుతూ జనంపైకి విసిరేశాడు. ఆ మాత్రలను మింగిన బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాత్రలను ఉచితంగా పంచడంపై అనుమానం వచ్చిన ఓ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు శనివారం నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీని అరెస్టు చేశారు. అతడి వద ్దనుంచి 15,000 విషపూరిత మాత్రలను స్వా«దీనం చేసుకున్నారు. ప్రేమ్‌జీ ఇచ్చిన మాత్రలను తీసుకున్నవారిలో 11 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఫయాజ్ పుణేలోని విమాన్ నగర్లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించాడు. గొడవల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2019 నుంచి 2025 దాకా ఇరాన్, ఇరాక్‌లో పలుమార్లు పర్యటించి వచ్చాడు. అతడి తల్లి, సోదరి ఇరాన్లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇరాన్, ఇరాక్‌లకు 19 సార్లు వెళ్లొచ్చాడు. అతడి ఆర్థిక లావాదేవీలు, మొబైల్ ఫోన్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. 15,000 మంది హత్య చేయాలన్న ఆలోచన అతడిదేనా? లేక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్ ఏకంగా 50 కిలోల జింక్ ఫాసై్పడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటిదాకా 15,000 క్యాప్సూల్స్‌లో ఒక్కో గ్రాము చొప్పున జింక్ ఫాసై్పడ్ను నింపాడు. మొత్తం 30,000 విషపు క్యాప్సూల్స్ తయారు చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో ఎవరి వల్ల కోవిడ్ విస్తరించింది?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శల దాడికి దిగారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవహార తీరుని హిందూ సమాజం గుర్తించాలని డిమాండ్ చేశారు. రంజాన్ సామూహిక ప్రార్థనలకు ఎలా అనుమతించారని, వేల మందితో మొహరం శోభాయాత్ర ఎలా చేశారని ప్రశ్నించారు. మొహరం యాత్రలో కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదని దుయ్యబట్టారు. హిందువులు మాత్రం ప్రభుత్వ అనుమతితో పండుగలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో హిందు సమాజం సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని తెలిపారు. అంతేగాక హైదరాబాద్‌లో ఎవరి వల్ల కోవిడ్ విస్తరించిందంటూ వ్యాఖ్యానించారు. (ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట) -
హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు
అతి ప్రమాదకరమైన ఓ హైటెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నొ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. మొహరం పండుగను పురస్కరించుకుని 'టాజియా' (పీర్ల పండుగ) ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఊరేగింపులో పాల్గొన్న చిన్నారులు పీర్ల జెండాను పట్టుకుని వెళుతుడంగా గంగా రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ సమీపంలో లోహాపు స్తంభానికి ఆ జెండా చిక్కుకుంది. అదే స్తంభానికి ఉన్న హైటెన్షన్ వైర్‌కు జెండా తగలడంతో విద్యుత్ ప్రసరించి విద్యుద్ఘాతం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ తీగలు నుంచి ఎక్కువ మొత్తంలో విద్యుత్ ప్రసరిస్తుంటోంది. విద్యుత్ తాకిడికి ఆ ఐదుగురి శరీరం బాగా కాలిపోయింది. వారి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.


