హైదరాబాద్‌లో ఎవరి వల్ల కోవిడ్‌ విస్తరించింది? | Bandi Sanjay Slams CM KCR Over Muharram Procession | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎవరి వల్ల కోవిడ్‌ విస్తరించింది?

Aug 31 2020 3:58 PM | Updated on Aug 31 2020 4:11 PM

Bandi Sanjay Slams CM KCR Over Muharram Procession - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శల దాడికి దిగారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వ్యవహార తీరుని హిందూ సమాజం గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రంజాన్‌ సామూహిక ప్రార్థనలకు ఎలా అనుమతించారని, వేల మందితో మొహరం శోభాయాత్ర ఎలా చేశారని ప్రశ్నించారు. మొహరం యాత్రలో కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదని దుయ్యబట్టారు. హిందువులు మాత్రం ప్రభుత్వ అనుమతితో పండుగలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో హిందు సమాజం సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని తెలిపారు. అంతేగాక హైదరాబాద్‌లో ఎవరి వల్ల కోవిడ్‌ విస్తరించిందంటూ వ్యాఖ్యానించారు. (ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement