కోల్‌కతా డాక్టర్‌ హత్యోదంతం : సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు | Supreme Court takes suo motu cognizance of Kolkata case, hearing on Tuesday | Sakshi
Sakshi News home page

కోల్‌కతా డాక్టర్‌ హత్యోదంతం : సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు

Aug 18 2024 5:06 PM | Updated on Aug 20 2024 11:14 AM

Supreme Court takes suo motu cognizance of Kolkata case, hearing on Tuesday

కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌ హత్యోదంతంలో కీలక పరిణామ చోటు చేసుకుంది. జూనియర్‌ డాక్టర్‌ కేసును అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. 

మంగళవారం ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది   తీవ్ర ఉత్కంఠతను రేపిస్తున్నాయి. 


 

Advertisement
 
Advertisement
Advertisement