
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు పలు ఓటరు జాబితాల్లో ఉన్నా పోటీ చేయొచ్చంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) ఇచ్చిన సర్క్యులర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా మీరెలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఉత్తరాఖండ్ పంచాయతీ రాజ్ చట్టం–2016కు వ్యతిరేకంగా ఎస్‌ఈసీ వివరణ ఉందంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో వేర్వేరు చోట్ల ఓటరుగా నమోదై ఉండరాదని ఆ చట్టం చెబుతోందని గుర్తు చేసింది. ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కగా చుక్కెదు రవడం గమనార్హం. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. ఓటు చోరీని సుప్రీంకోర్టు బట్టబయలు చేసిందని, ఎన్నికల కమిషన్ అధికార బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించింది.