సన్నీలియోన్‌ కానిస్టేబుల్‌ పరీక్షకు అప్లై చేశారా?

Sunny Leone Photo: Appears UP Police Recruitment Exam Admit Card Viral - Sakshi

సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు పలు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల్లో కనిపిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తాయి. ఎన్నికల ఐడీ, అధార్ కార్డుల్లో కూడా చాలా మం‍ది సెలబ్రిటీల ఫొటో ప్రక్షత్యమైన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రముఖ బాలీవుడ్‌ నటీ సన్నీలియోన్‌కు సంబంధించిన ఫొటో సైతం ఓ పోటీపరీక్షల దరఖాస్తులో కనిపించటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ ప్రరీక్ష దరఖాస్తులో ఓ అభ్యర్థి సన్నిలియోన్‌ ఫొటోతో అప్లై చేశారు. అయితే రిజిస్ట్రషన్‌ ప్రాసెస్‌లో సన్నీలియోన్ ఫొటోతో అప్లై చేసిన సదరు అప్లికేషన్‌కు అడ్మిట్‌ కార్డు కూడా జారీ అయింది. ప్రస్తుతం ఈ అడ్మిట్కార్డు  నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అడ్మిట్‌కార్డు వివరాల ప్రకారం.. న్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ బాలికల కళాశాల సన్నీలియోన్‌కు పరీక్ష కేంద్రంగా కేటాయించబడట గమనార్హం. ఫిబ్రవరి 17, 18 రెండు రోజుల పాటు యూపీలో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి.

మరోవైపు.. అభ్యర్థుల సమచారంలో అవకతకలు, అక్రమైన మార్గాల్లో పరీక్ష రాయాలని వేసుకున్న ప్రణాళికను భగ్నం చేస్తూ.. గత రెండు రోజుల్లో సుమారు 120 మంది అభ్యర్థులను అరెస్ట్‌ చేసినట్టు అక్కడి పోలీసు ఉ‍న్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట్లో వైరల్‌ అయిన సన్నీలియోన్‌ అడ్మిట్ కార్డుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

‘యూపీ పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షకు సన్నీలియోన్‌ అప్లై చేశారా?’ అని ఓ ‘ఎక్స్‌’ (ట్విటర్) హ్యాండిల్‌ కామెంట్‌ చేసింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పందిస్తూ... సన్నీలియోన్‌ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్‌కార్డు నకిలీది అని స్పష్టం చేసింది.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top