స్పీకర్‌ అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్‌ | Sharad Pawar Responds To Speaker Om Birla Comments On Emergency | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ ఓం బిర్లా అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్‌

Jun 29 2024 3:34 PM | Updated on Jun 29 2024 3:45 PM

Sharad Pawar Responds To Speaker Om Birla Comments On Emergency

ముంబై: ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పందించారు. స్పీకర్‌ స్థాయికి తగినట్లు  సభలో మాట్లాడలేదని విమర్శించారు. శనివారం(జూన్‌29) మీడియా సమావేశంలో పవార్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

లోక్‌సభ స్పీకర్‌ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారన్నారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోందని, ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారని పవార్‌ ప్రశ్నించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికను పవార్‌ స్వాగతించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement