మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి | several labourers deceased in tragic accident construction site Gujarat | Sakshi
Sakshi News home page

మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి

Oct 12 2024 3:44 PM | Updated on Oct 12 2024 4:17 PM

several labourers deceased in tragic accident construction site Gujarat

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

క్రెడిట్స్‌: Vibes of India 

ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా  కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement