నేడు సీఈసీ జ్ఞానేశ్‌పై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ! | SC Hear Pleas Against CEC Gyanesh Kumar Decisions Today Updates | Sakshi
Sakshi News home page

నేడు సీఈసీ జ్ఞానేశ్‌పై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

Oct 5 2026 9:26 AM | Updated on Oct 5 2026 9:26 AM

SC Hear Pleas Against CEC Gyanesh Kumar Decisions Today Updates

సాక్షి, ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

పిటిషనర్ల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. SIR ప్రక్రియకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు సుమారు 14 వరకు తీసుకున్నట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మాత్రం తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదు.

సిట్‌ కోసం డిమాండ్‌.. 
అంతేకాకుండా.. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. SIR సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివాదాస్పదంగా పేర్కొన్న 14 నిర్ణయాలను రద్దు చేయాలని, సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ విధులు నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా పిటిషన్లలో కోరారు.

ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం సీఈసీ రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నాయి. అక్టోబర్‌ 7న ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సంయుక్త నిరసనకు కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది.

మరోవైపు.. ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఈసీ నిర్ణయాల చట్టబద్ధత, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, SIRపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. అయితే పిటిషన్లలో చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై కోర్టు తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చదవండి: బెంగాల్‌లో ట్విస్ట్‌.. తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement